- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాషింగ్టన్ డీసీ కాల్పుల ఎఫెక్ట్.. అమెరికా సర్కార్ సంచలన నిర్ణయం
అమెరికా (America) రాజధాని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ (White House)కు అతి సమీపంలో అఫ్ఘానిస్తాన్‌కు చెందిన ఓ ఆగంతకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America) రాజధాని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ (White House)కు అతి సమీపంలో అఫ్ఘానిస్తాన్‌కు చెందిన ఓ ఆగంతకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్‌కు చెందిన ఇద్దరు సైనికులు తీవ్రమైన బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ అంశాన్ని అమెరికా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఈ మేరకు అఫ్ఘానిస్తాన్ జాతీయులకు సంబంధించిన అన్ని రకాల ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా ప్రకటించింది. వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్ (National Guard) సైనికులపై ఓ అఫ్ఘానిస్తాన్ వ్యక్తి దాడి చేసిన కొద్ది గంటల తర్వాతే ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సెక్యూరిటీ, వెట్టింగ్ ప్రొసీజర్ల పూర్తి సమీక్ష పూర్తయ్యే వరకు ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్లపై ఇవే ఆంక్షలు కొనసాగుతాయని USCIS అధికారులు పేర్కొన్నారు. అమెరికా ప్రజల భద్రత, తమ దేశ సార్వభౌమత్వ రక్షణే తమ ఏకైక లక్ష్యమని వెల్లడించారు.






