‘జెన్ జెడ్’ నిరసనల ఎఫెక్ట్.. నేపాల్‌ హోంమంత్రి రమేష్‌ లేఖక్‌ రాజీనామా

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-08 15:22:42  IST  )

ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ లాంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్‌లో ప్రజలు ‘జెన్ జెడ్’ పేరుతో ఆందోళన బాటపట్టారు.

‘జెన్ జెడ్’ నిరసనల ఎఫెక్ట్.. నేపాల్‌ హోంమంత్రి రమేష్‌ లేఖక్‌ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ లాంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్‌లో ప్రజలు ‘జెన్ జెడ్’ పేరుతో ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలోనే ఆ దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంమంత్రి రమేష్ లేఖక్ (Ramesh Lekhak) తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో జరుగుతున్న అలర్లను పూర్తి బాధ్యత వహిస్తున్నట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధానికి అందజేశారు.

మరోవైపు కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్‌ రాజధాని కాఠ్మండులో చేపడుతోన్న నిరసనలు తీవ్ర రూపం దాల్చి హింసకు దారి తీశాయి. ఇక న్యూ బనేశ్వర్‌ (New Baneshwar)లో నిరసనకారులు బారికేడ్‌లను ధ్వంసం చేసి పార్లమెంట్‌ను చుట్టుముట్టారు. అనంతరం పోలీసులను వెనక్కి తగ్గేలా చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్‌లతో బదులిచ్చాయి. ఈ ఘర్షణలో దాదాపు 20 మందికి పైగా మరణించగా.. మరో 250 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. అయితే, సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు రాష్ట్ర నిబంధనల కింద నమోదు చేయని కారణంగా వాటిపై నిషేధం విధించబడింది.

Next Story