FIITJEE : ఫిట్జీ కోచింగ్ సెంటర్లపై ఈడీ దాడులు

by Muthe.Rajitha |

ఫిట్జీ(FIITJEE) కోచింగ్ సెంటర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం దాడులు నిర్వహించింది.

FIITJEE : ఫిట్జీ కోచింగ్ సెంటర్లపై ఈడీ దాడులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిట్జీ(FIITJEE) కోచింగ్ సెంటర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం దాడులు నిర్వహించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో ఫిట్జీ శాఖలపై మనీ లాండరింగ్ ఆరోపణలతో రైడ్స్(ED Rides) చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA) కింద ఈ దాడులు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. నోయిడా, గాజియాబాద్, ఢిల్లీ, లక్నో, వారణాసి, పాట్నా, మీరట్, భోపాల్‌లలో వంటి పలు నగరాల్లో ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అకస్మాత్తుగా సంస్థలను మూసివేయడం వల్ల ఒక్కో విద్యార్థి జేఈఈ పరీక్ష కోచింగ్(JEE Exam Coaching) కోసం చెల్లించిన డబ్బులు మోసపోయామని, వాటిని సంస్థ తిరిగి చెల్లించలేదని వేలాది మంది తల్లదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుల ఆధారంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసులు అనేక కేసులు నమోదు చేసి, వాటిని ఈడీకి బదిలీ చేయడంతో రంగంలోకి దిగిన ఈడీ.. నేడు ఆ సంస్థ ప్రమోటర్ డీకే గోయెంకాకు చెందిన దాదాపు 10 చోట్ల ఏకకాలంలో దాడులు చేసి, ఆఫీసుల రికార్డులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. కాగా ఈ అక్రమాల్లో ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేసిన రూ.4 లక్షలతో.. దాదాపు రూ.12 కోట్లు సంస్థ మాయం చేసినట్టు సమాచారం. సంస్థ తీసుకున్న నిర్ణయాలతో 12000 వేల మంది విద్యార్థుల జీవితం ప్రశ్నార్థకంగా మారింది.

Next Story