Delhi liquor scam : మరొకరికి ఈడీ నోటీసులు

by Sathputhe Rajesh |   (  Updated:2022-09-19 06:46:24  IST  )

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట

Delhi liquor scam : మరొకరికి ఈడీ నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరింత దూకుడు పెంచుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో సహా పలు ప్రాంతాల్లో సోదాలు, విచారణ జరుపుతున్న ఈడీ.. తాజాగా మరో కీలక నేతకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేత దుర్గేష్ పాఠక్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు విజయ్ నాయర్ తో దుర్గేష్ పాఠక్ కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఈ నోటీసులు అందజేసింది.

పాఠక్ ప్రస్తుతం ఎంసీడీ ఎన్నికలకు పార్టీ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. దుర్గేష్ పాఠక్ కు ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సోమవారం ఉదయం ట్విట్టర్ వేదికగా స్పందించారు. మా ఎంసీడీ ఇన్ చార్జికి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. అసలు ఈడీ విచారణ ఎక్సైజ్ పాలసీపైనా? లేక ఎంసీడీ ఎన్నికలపైనా అంటూ నిలదీశారు. కాగా పాఠక్ ను సెప్టెంబర్ 6న ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

Next Story