దడ పుట్టిస్తున్న ఈడీ.. ఆప్‌ నేత ఇంట్లో కొనసాగుతోన్న రెయిడ్స్

by Kema Shiva Kumar |

ఆమ్‌ఆద్మీ (Aam Aadmi) ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి నిర్మాణ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ (Enforcement Directorate) అధికారులు దూకుడు పెంచారు.

దడ పుట్టిస్తున్న ఈడీ.. ఆప్‌ నేత ఇంట్లో కొనసాగుతోన్న రెయిడ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమ్‌ఆద్మీ (Aam Aadmi) ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి నిర్మాణ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ (Enforcement Directorate) అధికారులు దూకుడు పెంచారు. ఈ మేరకు ఇవాళ మాజీ ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) నివాసంతో పాటు మొత్తం 13 చోట్ల ఏకకాలంలో అధికారుల రెయిడ్స్ కొనసాగుతున్నాయి. 2018-19లో రూ.5,590 కోట్ల విలువైన 24 ఆసుపత్రి ప్రాజెక్టుల సంబంధించి అప్పటి విపక్ష నాయకుడు విజేందర్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ సౌరభ్ భరద్వాజ్ అక్రమాలపై విచారణ ప్రారంభించింది. దర్యాప్తు భాగంగా కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 11 కొత్త ఆసుపత్రుల నిర్మాణంలో 13 హాస్పిటల్స్ అప్‌గ్రేడేషన్‌లో భారీ ఎత్తున అక్కమాలు చోటుచేసుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది.

ఆసుపత్రుల నిర్మాణంలో ఆలస్యం, ఖర్చు పెరుగుదలతో పాటు ప్రభుత్వ సొమ్మును కాజేసినట్లుగా ఆధారాలు లభించాయి. అయితే, సౌరభ్ భరద్వాజ్ హయాంలో చేపట్టి ఏ ఆసుపత్రి కూడా సమయానికి పూర్తి కాలేదని, వాటి నిర్మాణాలకు రూ.వందల కోట్ల రూపాయల ఖర్చును పెంచారనే ఆరోపణలు మాజీ మంత్రిపై ఉన్నాయి. ఇందులో 7 ప్రీ-ఇంజనీర్డ్ సౌకర్యాలతో రూ.1,125 కోట్లతో నిర్మించిన తలపెట్టిన ICU ఆసుపత్రి ప్రాజెక్టు సగమే పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ (Greater Kailash) నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఢిల్లీ జల్ బోర్డ్‌కు అధ్యక్షుడిగా, ఆప్ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Next Story