- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కామ్ కేసు: మనీష్ సిసోడియాకు బిగుస్తున్న ఉచ్చు!
by GSrikanth |
దేశ రాజకీయాలతో పాటు వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాలతో పాటు వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ కేసులో వారం రోజుల పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించగా.. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మంగళవారం సిసోడియాను ఈడీ ప్రశ్నించే యోచనలో ఉంది. ఈ మేరకు సిసోడియాను ప్రశ్నించేందుకు అధికారులు కోర్టు అనుమతి తీసుకున్నారు.
దీంతో ఈరోజు, రేపు సిసోడియాను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో మనీష్ సిసోడియాను ఈడీ ప్రశ్నించడం ఇదే తొలిసారి. వారం పాటు సీబీఐ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం సిసోడియాకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. ఈ నేపథ్యంలో CBI విచారణ ఇలా ముగియగానే అలా ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు దర్యాప్తు మరింత ఉత్కంఠగా మారింది.
Next Story






