- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసీ సంచలన నిర్ణయం.. ‘ఫాల్తా’ ఎన్నిక రద్దు, మే 21న రీ పోలింగ్
పశ్చిమ బెంగాల్‌లోని ‘ఫాల్తా’ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎన్నికల అక్రమాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సంచలన కీలక నిర్ణయం తీసుకున్నది. పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్తా (Falta) అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేస్తూ మే 21న మొత్తం 285 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మే 24న ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. అయితే, ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్ సందర్భంగా ఫాల్తాలో పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నేరాలు జరిగాయని ఈసీ పేర్కొంది. రిగ్గింగ్, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయడం వంటి తీవ్రమైన ఆరోపణలను పరిశీలించిన అనంతరం, నిష్పాక్షికమైన ఎన్నికల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
Next Story






