- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీసీటీవీ ఫుటేజీ విషయంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే సమాధానం: ఈసీ
by Phanindra |
45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజీ ఎందుకు డిలీట్ చేయాలనుకున్నామో ఇప్పుడే చెప్పబోమని, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే బదులిస్తామని ఈసీ తేల్చిచెప్పింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: పోలింగ్ బూత్‌ల సీసీటీవీ ఫుటేజీలను 45 రోజులకు మించి స్టోర్ చేయకూడదని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఇలా సీసీటీవీ ఫుటేజిని 45 రోజుల్లో డిలీట్ చేసేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కారణాలు కోసం ఈసీనీ పలువురు సామాజిక కార్యకర్తలు సంప్రదించారు. సమాచార హక్కు చట్టం కింద ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించగా.. విషయం కోర్టులో ఉన్నందున సమాధానం చెప్పలేమని ఈసీ పేర్కొంది. ఈ విషయంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఈ వివరాలు అందించాలని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐఓ)కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Next Story






