EC: ఈసీ ఏం చెప్పబోతోంది? రాహుల్ ఆరోపణల నేపథ్యంలో రేపు ఈసీ కీలక ప్రెస్ మీట్

by Prasad Jukanti |

ఓటుచోరీ అంశంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో రేపు ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది.

EC: ఈసీ ఏం చెప్పబోతోంది? రాహుల్ ఆరోపణల నేపథ్యంలో రేపు ఈసీ కీలక ప్రెస్ మీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈసీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎపిసోడ్ దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఓటు చోరీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) విషయంలో ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ, విపక్షాలు వరుస విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు గంటలకు ఈసీ మీడియా ముందుకు రాబోతున్నది. మధ్యహ్నం 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెనస్ నిర్వహిచబోతున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం తప్ప ఇతర అంశాలపై ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించడం జరగదని కానీ అకస్మాత్తుగా రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ కు సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది. రేపటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటో వెల్లడించనప్పటికీ రాహుల్ గాంధీ, విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేపు ఈసీ ఏం చెప్పబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

Next Story