బిహార్ ఓటర్లలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ వాసులు!

by Phanindra |   (  Updated:2025-07-13 18:02:20  IST  )

బిహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో బిహార్‌ ఓటర్లలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ వాసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

బిహార్ ఓటర్లలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ వాసులు!
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ రాష్ట్రంలో భారీ సంఖ్యలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశవాసులు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) గుర్తించినట్లు సమాచారం. ఆగస్టు 1 తర్వాత ఎంక్వయిరీ చేసి, సెప్టెంబరు 30న ప్రచురించే తుది జాబితాలో వీరిని తొలగిస్తామని ఈసీ వెల్లడించింది. జూన్ 25 నుంచి బిహార్లో ఈసీ ఈ తనిఖీలు మొదలుపెట్టింది. జులై 26న ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది.

ప్రస్తుతం 77 వేలమందికిపైగా బూత్ లెవెల్ అధికారులు, ప్రభుత్వ స్టాఫ్, రాజకీయ పార్టీల వర్కర్లు కలిసి బిహార్లోని 7.8 కోట్లపైగా ఓట్లను తనిఖీ చేస్తున్నారు. బిహార్‌లో ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా ఓటర్ల జాబితా రివిజన్లు చేస్తామని ఈసీ ప్రకటించింది.

Next Story