- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఆరు జిల్లాల్లో ఇంటింటి సర్వే నిలిపేయండి
by Mahesh Kanagandla |
పశ్చిమ బెంగాల్‌లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆరు జిల్లాల్లో నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆరు జిల్లాల్లో నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. బెంగాల్‌లో ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాలున్న జిల్లాల్లో ఇంటింటి సర్వేను నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సీతయ్, మదారిహట్, నైహాతి, హరోవా, మేదినీపూర్, తలదంగ్రా అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలు ముగిసేవరకు నిలిపేయాలని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతోనే కోడ్ అమల్లోకి వస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. రూరల్ హౌజింగ్ స్కీమ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నది.
Next Story






