EC: మా భుజాల మీద తుపాకీ పెట్టి రాజకీయం.. రాహుల్ కు ఈసీ కౌంటర్

by Prasad Jukanti |

రాహుల్ గాంధీ ఆరోపణలకు ఈసీ కౌంటర్ ఇచ్చింది.

EC:  మా భుజాల మీద తుపాకీ పెట్టి రాజకీయం.. రాహుల్ కు ఈసీ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవని, ఎన్నికల సంఘం అన్ని పార్టీలను సమానంగా చూస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఈసీ.. విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓటు చోరీ అంశం, బిహార్ ఓటర్ల ప్రత్యేక సవరణపై వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన జ్ఞానేశ్ కుమార్.. ఎలాంటి ఆధారాలు లేకుండానే కొందరు ఓటు చోరీ పేరుతో అనసవర అనుమానాలు రేకెత్తిస్తున్నారని ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను గందరగోళం సృష్టిస్తున్నారు. ఈసీపై పగబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లతో రాజకీయం చేయాలని కుట్ర జరుగుతోందన్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా మా పని మేము చేసుకుంటామన్నారు. దుష్ప్రచారాల పట్ల మేం ఏ మాత్రం భయపడం అని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో లక్షలాది మంది పోలింగ్ ఏజెంట్లు, ఉద్యోగులు తమ విధులు సమర్థంగా నిర్వహించారు. ఈసీ ఎప్పుడూ చట్టాలను గౌరవిస్తుందన్నారు. ఓటర్ల అనుమతి లేకుండానే కొంత మంది ఓటర్ల ఫోటోలు మీడియాలో వచ్చాయని ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాదేనన్నారు.

ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీలు, ఓటర్లు, బీఎల్ఓలు భాగస్వాములయ్యారని ఎస్ఐఆర్ లో ఓటు తొలగిస్తే అభ్యంతరాలు తెలపొచ్చన్నారు. బిహార్ లో ఓటు చోరీ అనేది పచ్చి అబద్దం అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుందన్నారు. సంస్కరణల్లో భాగంగానే బిహార్ లో ఓటర్ జాబితా సవరణ రాజ్యంగం ప్రకారం పౌరులు స్వచ్చందంగా ఓటు వేయొచ్చుని తెలిపారు. పార్టీలు నియమించిన బీఎల్ఏల సమక్షంలోనే ఎస్ఐఆర్ జరిగింది. అయినా ఎస్ఐఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారు. బిహార్ లో గడిచిన 20 ఏళ్లుగా ఓటర్ లిస్టులో ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదన్నారు.

Next Story