గుజరాత్‌లో భూకంపం

by Yella Dhawani Reddy |

గుజరాత్ రాష్ట్రంలోని (Gujarat) కచ్ జిల్లాలో (Kutch) భూకంపం సంభవించింది.

గుజరాత్‌లో భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని (Gujarat) కచ్ జిల్లాలో (Kutch) భూకంపం సంభవించింది. గురువారం ఉదయం భూప్రకంపనాలు (Earthquake) చోటుచేసుకోవటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రికార్డు స్కేలు దీని తీవ్రత 3.3గా నమోదైనట్లు గాంధీనగర్‌లో ఉన్న భూకంప శాస్త్ర పరిశోధన సంస్థ (ISR) పేర్కొంది. బెలా పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో దక్షిణ-నైరుతి దిశలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనలు స్వల్పంగానే ఉండటం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గానీ చోటుచేసుకోలేదని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. కాగా, కచ్ జిల్లా సాధారణంగా చాలా అధిక భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతంగా పరిగణించబడుతోంది. ఇక్కడ తరచూ తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఇక 2001లో కచ్‌లో సంభవించిన భూకంపం, గత రెండు శతాబ్దాలలో భారత్‌లో జరిగిన మూడవ అతిపెద్ద, రెండవ అత్యంత విధ్వంసకరమైన భూకంపంగా పేర్కొంటారు. ఈ భూకంపంలో జిల్లా అంతటా ఉన్న అనేక గ్రామాలు, పట్టణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాంతో పాటు 13,800 మంది ప్రాణాలు కోల్పోగా, 1.67 లక్షల మంది గాయపడ్డారు.

Next Story