ఢిల్లీలో భూ ప్రకంపనలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-11 12:56:21  IST  )

దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనాలు సంభవించాయి.

ఢిల్లీలో భూ ప్రకంపనలు
X

దిశ, వెబ్‌ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) భూప్రకంపనాలు (Earthquake) సంభవించాయి. గురువారం ఉదయం 9:04 గంటల సమయంలో నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్ల ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. ఈ హఠాత్తు పరిణామంతో ప్రజలు ఒక్కసారిగా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అనేక కార్యాలయాలు, నివాస ప్రాంతాల్లో కంపనాలు స్పష్టంగా నమోదయ్యాయి. భూప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైంది. ఇక హర్యానాలోని ఝాజ్జర్‌కు ఈశాన్య దిశగా 4 కిలోమీటర్ల దూరంలో, భూమి నుంచి 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు అప్రమత్తంగా ఉండమని ప్రజలకు సూచించారు. భూకంపం సమయంలో తాము ఎదుర్కొన్న అనుభూతిపై నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Next Story