- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తరాఖండ్‌ను వణికించిన స్వల్ప భూకంపం
by Yella Dhawani Reddy |
ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రాన్ని శుక్రవారం భూకంపం వణికించింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రాన్ని శుక్రవారం భూకంపం వణికించింది. ఉత్తరకాశీ(Uttarkashi) జిల్లాలో ఉదయం స్వల్పంగా భూ ప్రకంపనలు నమోదయ్యారు. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) అధికారులు వెల్లడించారు. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
Next Story






