- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతగా నమోదు
దేశంలో వరుస భూకంపాలు ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వరుస భూకంపాలు ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఇవాళ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని చంబా జిల్లా (Chamba District)లో గంట వ్యవధిలోనే రెండు సార్లు భూ ప్రకంపనలు (Earthquakes) సంభవించాయి. మొదటిసారి సరిగ్గా ఉదయం 3.27 నిమిషాలకు, రెండోసారి 4.39 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించింది. అయితే, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు (Richter Scale)పై 3.3, 4.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (National Center for Seismology) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదిక వెల్లడించింది. కాగా, భూకంపాలు, ప్రకృతి విపత్తులు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల కులు జిల్లాలోని లగ్ఘాటి ప్రాంతంలో వరదలు అక్కడి వారికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. వరదల్లో భాగంగా భూత్‌నాథ్ బ్రిడ్జ్ సమీపంలోని పూర్తిగా రోడ్డు దెబ్బతిన్నది. అదేవిధంగా హనుమాని బాగ్ వద్ద ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోగా, ఓ శ్మశానవాటిక దెబ్బతిన్నదని డిప్యూటీ కమిషనర్ తోరుల్ ఎస్.రవీష్ తెలిపారు.






