- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మయన్మార్‌లో భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
మయన్మార్ లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని ప్రభావం భారత్ లో కూడా కనిపించింది. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు..

దిశ, వెబ్‌డెస్క్: మయన్మార్ లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదవ్వగా.. భారత్ లోని మణిపూర్, నాగాలాండ్, అసాంలలోనూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 6.10 గంటల సమయంలో మణిపూర్ లోని ఉఖ్రుల్ కు ఆగ్నేయంగా 27 కిలోమీటర్ల దూరంలో దిమాప 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. భూకంప కేంద్రం 24.73 N అక్షాంశం, 94.63E రేఖాంశంలో ఉంది.
భూకంప కేంద్రం నాగాలాండ్ లోని వోఖాకు ఆగ్నేయంగా 155 కిలోమీటర్లు, దిమాపూర్‌కు ఆగ్నేయంగా 159 కి.మీ, మోకోక్‌చుంగ్‌కు దక్షిణంగా 177 కి.మీ, మిజోరాంలోని న్గోపాకు ఈశాన్యంగా 171 కి.మీ మరియు చాంఫాయికి ఈశాన్యంగా 193 కి.మీ దూరంలో ఉంది. అర్థరాత్రి 12.09 గంటలకు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 3.4 తీవ్రతతో భూకంపం రాగా.. కొల్హాపూర్ కు వాయువ్యంగా 91 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. టిబెట్‌లో ఉదయం 4.28 గంటలకు 3.3 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. దీని కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ లోని పాంగిన్ కు ఉత్తరాన 227 కిలోమీటర్లు, అస్సాంలోని దిబ్రుగఢ్ కు ఉత్తరాన 303 కిలోమీటర్ల దూరంలో ఉంది.






