- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Earthquake : బలూచిస్థాన్ లో భూకంపం
ఆసియా(Asia)దేశాలను వరుస భూకంపాలు(Erthquake) వణికిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా(Asia)దేశాలను వరుస భూకంపాలు(Erthquake) వణికిస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి భూ ప్రకంపనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా సోమవారం మధ్యాహ్నం భారత్ లో స్వల్ప భూకంపం సంభవించగా.. సాయంత్రం పాకిస్థాన్(Pakisthan) లోని బలూచిస్థాన్(Baluchisthan) లో వరుస భూప్రకంపనలు ప్రజలను బెంబేలెత్తించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు అయింది. అలాగే కరాచీ(Karachi)లోనూ భూమి కంపించినట్టు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. బలూచిస్థాన్ కు 65కిమీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. వరుస ప్రకంపనలతో ప్రజలు భయంతో బైటికి పరుగులు తీశారు.
కాగా ఇటీవలే మయన్మార్(Mayanmar), థాయ్ లాండ్(Thailand) తో సహ, భారత్, చైనా వంటి దేశాల్లో భూకంపం సంభవించగా.. మయన్మార్, థాయ్ లాండ్ లో దాదాపు 1700 పైగా ప్రజలు మృతి చెందగా.. వేలాది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఆరోజు నుంచి పలు ఆసియా దేశాలు వరుసగా భూకంపాలతో వణికిపోతున్నాయి. అయితే ఇవేవీ మయన్మార్ భూకంపం అంత తీవ్రంగా లేకపోయినా.. ప్రజలు భయం గుప్పిట్లోనే బ్రతుకుతున్నారు. మయన్మార్, థాయ్ లాండ్ దేశాలకు ప్రపంచ దేశాలు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.






