- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : ఈశాన్య భారత రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. త్రిపురలోని గోమతి జిల్లాలో 3.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. మోరిగావ్‌కు సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప ప్రభావంతో మేఘాలయ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. కాగా ప్రకంపనలు రావడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
Next Story






