Earthquake: అస్సాంలో భూకంపం.. పొరుగు దేశాల్లోనూ కంపించిన భూమి

by Prasad Jukanti |

ఈశాన్య భారతంలో భూకంపం సంభవించింది.

Earthquake: అస్సాంలో భూకంపం.. పొరుగు దేశాల్లోనూ కంపించిన భూమి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భూకంపం (Earthquake in Assam) సంభవించింది. ఆదివారం సాయంత్రం రిక్టర్ స్కేల్ పై 5.9 తీవ్రతతో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అస్సాంలోని థెకియజులి ప్రాంతానికి 16 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు. అస్సాం భూకంప ప్రభావంతో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, చైనాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

Next Story