6.3 తీవ్రతతో భూకంపం.. ఊగిపోయిన రైలు

by Vemula.Srinu Prasad |

దక్షిణ మెక్సికోలో భూకంపం సంభవించింది....

6.3 తీవ్రతతో భూకంపం.. ఊగిపోయిన రైలు
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ మెక్సికోలో భూకంపం సంభవించింది. గెరెరోలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా తీవ్రత నమోదు అయింది. మార్కోస్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో 6.21 మైళ్ల లోతులో సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ స్పష్టం చేసింది. అయితే భూకంపం దెబ్బకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఓ రైల్వే స్టేషన్‌లో రైలు ఊగిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే స్టేషన్‌లో రైలు ఆగడంతో ప్రయాణికులు దిగిపోయారు. ఈ సమయంలో భూకంపం రావడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ అధికారులు ప్రకటించారు.

Next Story