- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణిపూర్-మయన్మార్ బార్డర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదు
గడిచిన 36 గంటల్లో మణిపూర్-మయన్మార్ (Manipur-Myanmar) సరిహద్దు ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.8 నుంచి 4.5 తీవ్రతతో మొత్తం ఆరు సార్లు భూకంపాలు సంభవించాయి.

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన 36 గంటల్లో మణిపూర్-మయన్మార్ (Manipur-Myanmar) సరిహద్దు ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.8 నుంచి 4.5 తీవ్రతతో మొత్తం ఆరు సార్లు భూకంపాలు సంభవించాయి. చివరి భూ ప్రకంపనలు మంగళవారం ఉదయం 11:21 గంటలకు మణిపూర్ సమీపంలో 4.3 తీవ్రతతో నమోదయ్యాయి. భారత టెక్టానిక్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ ఢీకొని ఏర్పడిన టెక్టానిక్ జోన్‌లో ఆ ప్రాంతం వల్ల అక్కడ వరస భూకంపాలు సంభవిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. కాగా, మార్చి 28న మయన్మార్‌లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా 3,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా పొరుగు దేశమైన థాయిలాండ్‌లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకుని భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (IFRC) ప్రకారం.. భూకంపాల కారణంగా 2 లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లినట్లుగా గుర్తించారు.






