Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతగా నమోదు

by Kema Shiva Kumar |

ఇండోనేషియా (Indonesia) దేశంలోని సులవేసి (Sualvesi) ప్రాంతంలో భూకంపం సంభవించింది.

Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతగా నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియా (Indonesia) దేశంలోని సులవేసి (Sualvesi) ప్రాంతంలో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం సరిగ్గా ఉదయం 6.55 గంటలకు 6.1 తీవ్రతతో భూమి కంపించింది. ఆకస్మాత్తుగా భూమి కంపించడంతో జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరగుతోందని తెలుసుకునే లోపే ప్రణాలు కాపాడుకునేందుకు అంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (United States Geological Survey) అధికారులు వెల్లడించారు. అదేవిధంగా సునామీ (Tsunami) వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. 2018లో సులవేసి (Sulavesi)లో భారీ భూకంపంతో 2,200 మంది, అదేవిధంగా 2021 జనవరిలో 100 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా, మంగళవారం ఉదయం 6.10 గంటలకు బంగాళాఖాతం (Bay of Bengal)లో భూకంపం సంభించింది. దీంతో సమీపంలో ఉన్న పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని కోల్‌కతా (Kolkata) నగరంలో స్వల్పంగా భూమి కంపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకటించింది. అయితే, భూకంప తీవ్రంత రిక్టర్ స్కేలు (Richter scale)‌పై తీవ్రత 5.1గా నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు. బంగాళాఖాతంలోని సముద్ర గర్భంలో 91 కి.మీ లోతున భూకంపం సంభవించినట్లుగా నేషల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసింది.

Next Story