- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా పర్యటనకు జైశంకర్.. గల్వాన్ ఘర్ణణల తర్వాత తొలిసారి!
ఐదేళ్ల తర్వాత చైనా పర్యటనకు జైశంకర్ వెళ్లనున్నారు. గల్వాన్ ఘర్ణణల తర్వాత డ్రాగన్ కంట్రీలో ఇదే ఆయన తొలి పర్యటన!

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐదేళ్ల తర్వాత చైనా పర్యటనకు వెళ్లనున్నారు. జులై 13-15 మధ్య ఆయన సింగపూర్, చైనాల్లో ఆయన పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. తొలుత ఆయన సింగపూర్ వెళ్లి ఆ దేశ విదేశాంగ మంత్రి, ప్రెసిడెంట్‌తో కీలక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం చైనాలోని టియాంజిన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) కాంక్లేవ్‌లో ఆయన పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. 2020లో తూర్పు లడఖ్‌లో భారత్, చైనా దళాల మధ్య గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డ్రాగన్ దేశానికి జైశంకర్ వెళ్లడం ఇదే తొలిసారి.
Next Story






