6 రోజులు.. 3 దేశాలు.. జైశంకర్ టూర్.. ఉగ్రవాదానికి పాక్ మద్దతుపై ప్రచారం?

by Phanindra |

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ 6 రోజుల్లో 3 యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. ఉగ్రవాదానికి పాక్ మద్దతుపై ఈ దేశాలతో చర్చలు జరిగే అవకాశం ఉంది.

6 రోజులు.. 3 దేశాలు.. జైశంకర్ టూర్.. ఉగ్రవాదానికి పాక్ మద్దతుపై ప్రచారం?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ 6 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. నెదర్లాండ్స్, డెన్మార్క్, జర్మనీ వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. సోమవారం నుంచి ఆయన పర్యటన ప్రారంభం అవనుంది. ‘మే 19 నుంచి 24 వరకు నెదర్లాండ్స్, డెన్మార్క్, జర్మనీలో జైశంకర్ పర్యటించనున్నారు. ఈ మూడు దేశాల ప్రభుత్వాధినేతలను కలిసి కొన్ని కీలక అంశాలపై ఆయన చర్చలు జరుపుతారు’ అని విదేశాంగ శాఖ తెలిపింది.


జైశంకర్ జర్మనీ పర్యటన పహెల్గాం ఉగ్రదాడికి ముందే షెడ్యూల్ చేయగా.. ఈ ఉగ్రదాడి తర్వాత నెదర్లాండ్స్, డెన్మార్క్‌లకు ఆయన్ను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ దేశాధినేతలకు సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఏ విధంగా పెంచి పోషిస్తుందో కూడా ఆయన వివరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story