- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌లోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తాం.. బ్రసెల్స్‌లో జైశంకర్ వార్నింగ్!
ఉగ్రవాదులు ఎక్కడున్నా వారి వదిలేది లేదని జైశంకర్ స్పష్టంచేశారు. పాక్‌లో దాక్కుంటే చొచ్చుకెళ్లి మరీ దాడులు చేస్తామన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: మరోసారి ఉగ్రదాడులతో రెచ్చగొట్టేందుకు చూస్తే పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న ఆయన.. బ్రసెల్స్‌లో ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టంచేశారు. ‘ఏప్రిల్‌లో చేసినటువంటి అమానవీయ దాడులు చేస్తుంటే కచ్చితంగా మా నుంచి ప్రతిఘటన బలంగా ఉంటుందనేదే మేం ఇచ్చే సందేశం. మా ప్రతిఘటన ఉగ్రవాద సంస్థలు, వాటి లీడర్లపై ఉంటుంది. వాళ్లు ఎక్కడున్నా మాకు అనసవరం. పాకిస్తాన్ లోపల తలదాచుకొని ఉంటే.. అక్కడకు వెళ్లి మరీ దాడి చేస్తాం’ అని జైశంకర్ తేల్చిచెప్పారు.
పాకిస్తాన్‌లో ఉగ్రవాదం అనేది ఒక దేశ విధానంగా మారిందని, ఆ దేశం ఇంత దిగజారడమే సమస్య అని ఆయన వివరించారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితులు ఇంకా అలాగే ఉన్నాయా? అని ప్రశ్నించగా.. ‘ఉగ్రవాదానికి మద్దతివ్వడమే ఈ ఉద్రిక్తతలకు కారణం అంటే.. అది అలాగే ఉంది’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో భారత్‌కు జరిగిన మిలిటరీ నష్టం గురించి కూడా ఆయన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ‘రఫేల్, ఇతర వ్యవస్థలు ఎలా పనిచేశాయి అంటే.. పాకిస్తాన్‌లో ధ్వంసమైన ఎయిర్‌ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. నాకు అవే రుజువులు’ అని చెప్పారు. అలాగే మే 10 ఉదయాన పాక్‌లోని 8 కీలక ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడి చేసిందని, ఆ కారణం వల్లనే ఇరుదేశాల మధ్య గొడవ సద్దుమణిగిందని పేర్కొన్నారు.






