- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
E20: ఈ20 పెట్రోల్‌కు గ్రీన్ సిగ్నల్.. ఆ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయవాది అక్షయ్ మల్హోత్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ (EBP-20) ఉద్దేశపూర్వకంగా లక్షలాది వాహనాలకు తగిన ఇంధనాన్ని అందకుండా చేస్తుందని పేర్కొన్నారు. కాబట్టి అన్ని పెట్రోల్ పంపుల వద్ద ఇథనాల్ రహిత ఇంధనాన్ని కూడా అందించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీనిపై సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ఈ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఈ పిటిషన్ వెనుక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. ఇథనాల్ మిశ్రమం వల్ల చెరకు రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని తెలిపారు. అమలుకు ముందు ప్రభుత్వం తగిన పరిశీలన చేసిందని, దేశంలో ఏ పెట్రోల్ ఉపయోగించాలో దేశం బయట ఉండే వ్యక్తి నిర్ధేశిస్తారా అని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండానే కొట్టి వేసింది. దీంతో దేశంలో ఈ20 పెట్రోల్ వాడకానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.






