- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ20 ఇంధనంతో తక్కువ కాలుష్యం: కేంద్రం
ఈ20 ఇంధనంతో తక్కువ కాలుష్యం వస్తుందని, యాక్సిలరేషన్ కూడా పెరుగుతోందని కేంద్రం తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడంపై వస్తున్న విమర్శలను కేంద్రం తోసిపుచ్చింది. ఇలా చేయడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, అలాగే యాక్సిలరేషన్ మెరుగవుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ10 ఇంధనంతో పోలిస్తే ఈ20 ఫ్యూయల్ వల్ల ప్రయాణ నాణ్యత మెరుగవడంతోపాటు కనీసం 30 శాతం కార్బన్ ఎమిషన్స్ తగ్గుతున్నాయని వివరించింది.
అదే సమయంలో కొందరు వాహనదారులు మైలేజీ తగ్గిందనడం, అలాగే అధిక ఇథనాల్ కంటెంట్‌ను తట్టుకునేలా సామర్థ్యం లేని ఇంజిన్‌లు చెడిపోతాయని ఆందోళన చెందడాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ అనుమానాలు 2020లోనే కేంద్రానికి వచ్చాయని, ఈ అంశంపై ప్రభుత్వం, నీతి ఆయోగ్‌లోని ఇంటర్-మినిస్టీరియల్ కమిటీ పరిశోధనలు చేసిందని కేంద్రం తెలిపింది.
ఇక మైలేజ్ తగ్గడం అనేది కేవలం ఇంధనంపైనే ఆధారపడి ఉండదని, ఎన్నో అంశాల వల్ల మైలేజీ ప్రభావితం అవుతుందని పేర్కొంది. ఇథనాల్ ఆక్టేన్ నెంబర్ 108.5 అనేది పెట్రోల్ నెంబర్ 84.4 కన్నా ఎక్కువని, ఇది కొత్తగా వస్తున్న హై-కంప్రెషన్ ఇంజిన్లకు మరింత సూటబుల్ అని పెట్రోలియం మినిస్ట్రీ వివరించింది.






