Dust Storm : ఢిల్లీలో ధూళి తుఫాన్ బీభత్సం.. విమాన రాకపోకలు బంద్

by Muthe.Rajitha |

దేశ రాజధాని ఢిల్లీ(Delhi) నగరాన్ని బుధవారం సాయంత్రం భారీ ధూళి మేఘం(Dust Storm) కమ్మేసింది.

Dust Storm : ఢిల్లీలో ధూళి తుఫాన్ బీభత్సం.. విమాన రాకపోకలు బంద్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ(Delhi) నగరాన్ని బుధవారం సాయంత్రం భారీ ధూళి మేఘం(Dust Storm) కమ్మేసింది. ఢిల్లీతోపాటు ఎన్సీఆర్(NCR), నోయిడా(Noida) ప్రాంతాల్లో గంటకు 70-80 కి.మీ వేగంతో ధూళి తుఫాన్ రేగింది. దీని కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGIA)లో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 450కి పైగా విమానాలు ఆలస్యం కాగా.. 50కి పైగా విమానాలు జైపూర్, అమృత్‌సర్, లక్నో, అహ్మదాబాద్‌లకు డైవర్ట్ చేయబడ్డాయి. మరో18 విమానాలు రద్దయ్యాయి. పలు విమానయాన సంస్థలు విమానాల రద్దు గురించి ప్రయాణికులకు సమాచారం అందించాయి.

భారీ వర్షాలు, ధూళి తుఫాన్ తో ఢిల్లీ, నోయిడాలో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల కిమీల మేర ట్రాఫిక్ జామ్‌లు సంభవించాయి. భారత వాతావరణ శాఖ(IMD) ఢిల్లీ వాసులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా ఇంటిలోనే ఉండాలని హెచ్చరికలు చేసింది. మరోవైపు హరియాణా, యూపీలోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Next Story