అడినో వైరస్ కలకలం.. వారందరికి సెలవులు క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం

by Disha Web Desk 19 |
అడినో వైరస్ కలకలం.. వారందరికి సెలవులు క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో అడినో వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శ్వాస సంబంధిత సమస్యలతో చిన్నారుల మరణాలు ఆందోళనకరంగా మారడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది అందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఫీవర్ క్లిని‌లు వారంలో అన్ని రోజులు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలో అడినో వైరస్ కారణంగా గడిచిన 9 రోజుల్లో 19 మంది చిన్నారులు మృతి చెందారు. దీంతో అప్రమత్తం అయిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలు మళ్లీ మాస్కులు ధరించి, జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.



Next Story