- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా రాపర్‌తో దుబాయ్ యువరాణి రెండో పెళ్లి
దుబాయ్ యువరాణి షేక్ మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ రెండో పెళ్లికి సిద్దమవుతున్నారు. గతేడాది తన భర్తకు విడాకులు ఇస్తూ యువరాణి ఇన్ స్టాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: దుబాయ్ యువరాణి షేక్ మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ రెండో పెళ్లికి సిద్దమవుతున్నారు. గతేడాది తన భర్తకు విడాకులు ఇస్తూ యువరాణి ఇన్ స్టాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. డివోర్స్ యూ అంటూ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించింది. తన భర్త ఇతరుల సహచర్యం కోరుకోవడం వల్లనే విడిపోతున్నట్టు తెలిపింది. మొదటి భర్తతో మహ్రాకు ఓ కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం కుమార్తె బాధ్యతలను యువరాణే చూసుకుంటోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు యువరాణి మరోసారి వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.
ప్రముఖ అమెరికన్ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానాతో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ర్యాపర్ అధికార ప్రతినిధి ధ్రవీకరించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. అనేకసార్లు దుబాయ్ వీధుల్లో చక్కర్లు కొడుతూ మీడియా కంటపడ్డారు. అంతే కాకుండా పారిస్ ఫ్యాషన్ వీక్‌లో కూడా వీరిద్దరూ కలిసి కన్పించారు. ఆ సమయంలోనే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం యువరాణి వయసు 31 కాగా ఆమె ప్రియుడు ఫ్రెంచ్ మోంటానా వయసు 41ఏళ్లు. దీంతో తన కంటే పదేళ్లు పెద్దవాడిని యువరాణి పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.






