Hind : కూతురికి హింద్ అని పేరు పెట్టిన దుబాయ్ ప్రిన్స్

by Muthe.Rajitha |

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్(Dubai Crown Prince Sheikh Hamdan) తన నాల్గవ సంతానానికి "హింద్"(Hind) అని పేరు పెట్టారు.

Hind : కూతురికి హింద్ అని పేరు పెట్టిన దుబాయ్ ప్రిన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్(Dubai Crown Prince Sheikh Hamdan) తన నాల్గవ సంతానానికి "హింద్"(Hind) అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ పేరు ఆయన తల్లి షేకా హింద్ బింత్ మక్తూమ్‌(Sheikha Hind bint Maktoum)కు గౌరవ సూచకంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. కాగా "హింద్" అనే పేరుకు అరబీ భాషలో 'సమృద్ధి' అని అర్థం. అదే విధంగా ఈ పేరు భారత ఉపఖండాన్ని సూచించే పురాతన పేరు. ఇది ధార్మిక సంబంధమైన పేరు కాకపోవడంతో మతపరమైన ఇబ్బందులు ఏవీ లేవన్నారు.

కాగా ఆ ఆడశిశువు పూర్తి పేరు "షేఖా హింద్ బింట్ ముఖ్తుమ్ బిన్ జుమా అల్ ముక్తుమ్" గా నామకరణం చేశారు. అల్లా ఆశీర్వాదం వల్ల మాకు కలిగిన నాలుగవ బిడ్డకు హింద్ పేరు పెట్టామని ప్రిన్స్ తెలిపారు. కాగా షేక్ హమ్దాన్ కు ఇప్పటికే ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉండగా.. ఇపుడు నాలుగవ సంతానంగా పుట్టిన ఆడ శిశువుకు ఈ పేరు పెట్టారు. అయితే దుబాయ్ ప్రిన్స్ పెట్టిన ఈ పేరుపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

Next Story