దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేత.. మధ్యలోనే వెనుదిరిగిన ఎమిరేట్స్ విమానం

by Kema Shiva Kumar |

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేతతో తిరువనంతపురం నుంచి వెళ్లిన ఎమిరేట్స్ విమానం మధ్యలోనే వెనుదిరిగింది.

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేత.. మధ్యలోనే వెనుదిరిగిన ఎమిరేట్స్ విమానం
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని తిరువనంతపురం (Thiruvananthapuram) నుంచి దుబాయ్ (Dubai) వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం ప్రయాణం మధ్యలోనే నిలిచిపోయింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో గాల్లోనే ఉన్న విమానం తిరిగి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అకస్మాత్తుగా దుబాయ్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం అందడంతో పైలట్ విమానాన్ని హుటాహుటిన వెనక్కి మళ్లించారు. దీంతో తిరువనంతపురం విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులందరినీ విమానాశ్రయ టెర్మినల్‌కు తరలిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ దాడుల కారణంగా అక్కడ విమాన సర్వీసులను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.

Next Story