మనాలిలో దారుణ ప‌రిస్థితులు..రాకపోకలకు తీవ్ర అంతరాయం

by velandi.Saikiran |

మంచు దుప్పటిలో మనాలి ఉన్న నేపథ్యంలో.. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రహదారులన్నీ మంచుతో నిండిపోయాయి.

మనాలిలో దారుణ ప‌రిస్థితులు..రాకపోకలకు తీవ్ర అంతరాయం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారతదేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా తగ్గిపోతున్నాయి. మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ...మళ్లీ ఇప్పుడు చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో చలి తీవ్రత ఎక్కువైందని చెబుతున్నారు. తాజాగా మనాలిలో మంచు విపరీతంగా పడుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో భారీ హిమపాతం కురుస్తోంది. దీంతో పర్యటకులు చాలా కష్టాలు పడుతున్నారు. ఎటూ వెళ్లలేని పరిస్థితిలు నెలకొంటున్నాయి.

మంచి దుప్పటిలో మనాలి

మంచు దుప్పటిలో మనాలి ఉన్న నేపథ్యంలో.. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రహదారులన్నీ మంచుతో నిండిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రతరాయం ఏర్పడి ట్రాఫిక్ పెరుగుతుంది. ఈ తరుణంలో స్థానిక యంత్రాంగం అప్రమత్తమై పర్యాటకులకు కీలక సూచనలు కూడా జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని కూడా పేర్కొంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని కూడా హెచ్చరికలు జారీ చేసింది. మంచులో ప్రయాణించేటప్పుడు అధికారుల ఆదేశాలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది సర్కార్.

Next Story