- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హఠాన్మరణం
by S Gopi |
కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్రువనారాయన్ (62) గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.... Druva Narayan passes away

X
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్రువనారాయన్ (62) గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి ఆయనకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పిరావడంతో కుటుంబ సభ్యులు డీఆర్ఎంస్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందారు. సుధీర్ఘ రాజకీయ జీవితం కలిగిన ధ్రువనారాణయన్ 1983లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ధ్రువనారాయన్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Next Story






