- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందు మత్తులో.. నడిరోడ్డుపై దేశాధ్యక్షురాలితో అసభ్య ప్రవర్తన!
మందు మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా.. ఒక వ్యక్తి నడిరోడ్డుపై ఏకంగా తమ దేశాధ్యక్షురాలితోనే అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌తో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ప్రజలతో ఆమె సంభాషిస్తుండగా.. వెనుకగా వచ్చిన ఒక వ్యక్తి ఆమెను కౌగిలించుకొని మెడపై ముద్దుపెట్టబోయాడు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఆందోళన చెందినా కూడా, చాలా ప్రశాంతంగా స్పందించిన క్లాడియా.. నెమ్మదిగా అతని చేతులను తనపై నుంచి తొలగించింది. అనంతరం ఆమె భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించిన ఆ వ్యక్తి.. అధ్యక్షురాలికి అంత దగ్గరగా వచ్చే వరకూ ఆమె సెక్యూరిటీ స్పందించలేదు. ఈ ఘటన కలకలం రేపడంతో మెక్సికో తొలి మహిళా ప్రధాని అయిన క్లాడియా భద్రతపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒక దేశాధ్యక్షురాలికే సరైన భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితేంటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
CRAZY moment man GROPES Mexico’s President Claudia Sheinbaum
— RT (@RT_com) November 4, 2025
Then TRIES to kiss her before security finally wakes up
How was security THIS slow to react? pic.twitter.com/vaECXy0bCW






