- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ తీసుకుంటున్న పోలీస్ ఆఫీసర్.. దుమారం రేపుతున్న వీడియో
యూనిఫాంలో డ్రగ్స్ తీసుకుంటున్న పంజాబ్ పోలీస్ ఆఫీసర్ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. హోషియార్‌పూర్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్.. డ్రగ్స్‌ను ఆస్వాదిస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది కూడా యూనిఫాంలో ఉండి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు

X
దిశ, వెబ్ డెస్క్ : యూనిఫాంలో డ్రగ్స్ తీసుకుంటున్న పంజాబ్ పోలీస్ ఆఫీసర్ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. హోషియార్‌పూర్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్.. డ్రగ్స్‌ను ఆస్వాదిస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది కూడా యూనిఫాంలో ఉండి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో నెగెటివిటీ మరింత ఎక్కువైంది. బహిరంగ ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో క్రమశిక్షణా చర్య కింద సదరు పోలీసును సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ పంజాబ్‌లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. 2023లో ఫిరోజ్‌పూర్‌కు చెందిన కానిస్టేబుల్ సత్పాల్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్ కాగా అతన్ని సస్పెండ్ చేశారు. దీంతో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టాల్సిన పోలీసులే.. ఇలా చేస్తుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Next Story






