- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi High Court: ఆప్ ప్రభుత్వ తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎక్సైజ్ పాలసీ స్కాం(Excise Policy Scam Case)పై కాగ్ ఇచ్చిన నివేదిక రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎక్సైజ్ పాలసీ స్కాం(Excise Policy Scam Case)పై కాగ్ ఇచ్చిన నివేదిక రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా.. ఈ అంశంపైన ఆప్(AAP) సర్కారుకు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. కావాలనే అసెంబ్లీలో కాగ్ నివేదికపై చర్చ జరపకుండా ఆలస్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఈ నివేదిక విషయంలో మీరు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం దురదృష్టకరం. మీరు వాటిని వీలైనంత త్వరగా స్పీకర్‌కు పంపి.. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఉండాల్సింది. మీరు (Delhi Govt) ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా ఆలస్యం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ చర్య మీ నిజాయతీపై సందేహాలను లేవనెత్తుతోంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై భోజన విరామం తర్వాత పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించింది.
కాగ్ నివేదికపై..
ఢిల్లీ (Delhi) ఎక్సైజ్ పాలసీ విధానంపై కాగ్ ఇచ్చిన నివేదికను (CAG Report) అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గానూ ప్రత్యేక సెషన్‌కు ఆదేశించాలని కోరుతూ విజయేందర్ గుప్తా సహా బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించారు. కాషాయపార్టీ ఎమ్మెల్యేల పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీ మద్యం పాలసీ (Delhi liquor Scam Case)పై కాగ్ రూపొందించిన నివేదిక లీకైనట్లు ఇటీవలే నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. రద్దయిన లిక్కర్ పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2026 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేసుపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదిక లీకైనట్టు పలు కథనాలు వెల్లడించాయి. అంతేగాక మద్యం పాలసీలో అనేక అవకతవకలు జరిగాయని, లైసెన్స్‌ల జారీలోనూ లోపాలున్నాయని నివేదిక పేర్కొన్నట్టు తెలిపాయి. దీంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు లంచాల ద్వారా లబ్ధి పొందారని నివేదిక ఆరోపించినట్టు సమాచారం. నిపుణుల కమిటీ సూచించిన సిఫార్సులనూ అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నేతృత్వంలోని మంత్రుల బృందం తిరస్కరించినట్లు పేర్కొంది. కేబినెట్ ఈ విధానాన్ని ఆమోదించిందని అయితే అనేక కీలక నిర్ణయాలపై అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తీసుకోలేదంది. దీనిపైనే, ఆప్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.






