- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 40 మందికి పైగా మృతి
కాగా ఈ దుర్ఘటనలో 48 మంది వరకు చనిపోయి ఉండొచ్చునని స్థానిక మీడియా వెల్లడించింది. కానీ కార్మిక సంఘ ప్రతినిధులు మాత్రం 43 మంది చనిపోయినట్లు చెప్పారు.

- మృతుల్లో అత్యధికులు మహిళలే
- వెస్ట్ మాలీలో దుర్ఘటన
దిశ, నేషనల్ బ్యూరో: ఓ అక్రమ బంగారు గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఆఫ్రికాలోని వెస్ట్ మాలీలో శనివారం ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. బంగారం కోసం అన్వేషిస్తూ కొంత మంది అక్రమంగా తవ్వుతున్న బంగారపు గనికి సంబంధించి కొండ చరియలు విరిగిపడటంతో అందులో పని చేస్తున్న కూలీలు మట్టిలో కూరుకొని పోయారు. అధికారుల లెక్కప్రకారం 40 మందికి పైగా మృతి చెందగా అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. వెస్ట్ మాలీలో ఈ తరహా ఘటన జరగడం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండోది. కాగా చైనాకు చెందిన వాళ్లు నిర్వహిస్తున్న ఈ గోల్డ్ మైన్‌లో కార్మికులు తవ్వకాలు చేపట్టి వెళ్లిపోయిన తర్వాత.. కొంత మంది ఆ గనిలో బంగారం కోసం వెదుకుతుండగా వారిపై కొండ చరియలు విరిగిపడినట్లు గోల్డ్ మైనర్స్ యూనియన్ లీడర్ తెలిపారు. కాగా ఈ దుర్ఘటనలో 48 మంది వరకు చనిపోయి ఉండొచ్చునని స్థానిక మీడియా వెల్లడించింది. కానీ కార్మిక సంఘ ప్రతినిధులు మాత్రం 43 మంది చనిపోయినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే చాలా వరకు మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిసింది. కాగా, ప్రపంచంలో అత్యధిక బంగారు మైనింగ్ జరిగే దేశాల్లో మాలీ ఒకటి. ఇక్కడ అధికారంగానే కాకుండా అక్రమంగా కూడా మైనింగ్ జరుగుతుంటుంది.






