- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద, మధ్యతరగతి వారికి డబుల్ బొనాంజా
దేశ వ్యాప్తంగా రేపటినుంచి పండుగ వాతావరణం ఉండబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా రేపటినుంచి పండుగ వాతావరణం ఉండబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు. ఇవాళ అర్థరాత్రి నుంచి జీఎస్టీ 2.0 అమలు కాబోతున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపట్నుంచి జీఎస్టీ ఉత్సవ్(GST Utsav) ప్రారంభం కాబోతోందని, కొత్త చరిత్ర మొదలవుతోందని ప్రధాని మోడీ అన్నారు. జీఎస్టీ(GST) మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌క్‌కు మరింత ఊతమిస్తాయన్నారు. దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని చెప్పారు. వీటితో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత ఊతమిస్తాయని మోడీ అన్నారు. ‘ఈ చర్యలతో మధ్య తరగతి జీవితాల్లో ఎంతో మార్పు రానుంది. కొత్త జీఎస్టీతో పేద మధ్యతరగతివారికి డబుల్ బొనాంజా. టీవీ, ఫ్రిజ్, స్కూటర్, ఇంటి నిర్మాణంపై ఖర్చు తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణలు అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తుంది’ అని ప్రధాని మోడీ ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
2017లో జీఎస్టీతో కొత్త అధ్యాయం మొదలైంది. అంతకు ముందు ఎన్నో రకాల పన్నులు ఉండేవి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్న పన్నులు కట్టాల్సి ఉండేది. జీఎస్టీ సంస్కరణలు ఎఫ్‌డీఐలను మరింత ప్రోత్సహిస్తాయి. గతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి వస్తువులు అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. గతంలో టాక్స్, టోల్‌తో కంపెనీలన్ని ఇబ్బందులు పడ్డాయి. ఆ భారమంతా వినియోగదారులపై పడేదని ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుర్తుచేశారు.






