పేలిన టైర్.. తగలబడిన మరో బస్సు

by Naga Rani Yarlagadda |

కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై రెండ్రోజులైందో లేదో.. మరో బస్సు అగ్నికి ఆహుతయింది.

పేలిన టైర్.. తగలబడిన మరో బస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై రెండ్రోజులైందో లేదో.. మరో బస్సు అగ్నికి ఆహుతయింది. ఆదివారం తెల్లవారుజామున లక్నో - ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే పై ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి గోండ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు టైర్ ఉన్నట్టుండి పేలింది. దాంతో బస్సు కింది నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో.. ప్రయాణికులంతా బస్సు నుంచి కిందికి దిగడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో కకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే టోల్ ప్లాజా ముందు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని బస్సు మంటలను ఆర్పివేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు

Next Story