- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NEP: విద్యా హక్కు నిధులను నిలిపివేయవద్దు: కేంద్రానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
విద్యా హక్కు (RTE) చట్టం కింద నిధుల విడుదలను జాతీయ విద్యా విధానం (NEP)తో అనుసంధానించవద్దని, సమగ్ర శిక్ష పథకం కింద నిధులు విడిగా విడుదలయ్యేలా చూడాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది

దిశ, నేషనల్ బ్యూరో: విద్యా హక్కు (RTE) చట్టం కింద నిధుల విడుదలను జాతీయ విద్యా విధానం (NEP)తో అనుసంధానించవద్దని, సమగ్ర శిక్ష పథకం కింద నిధులు విడిగా విడుదలయ్యేలా చూడాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిధులను విడుదల చేయకపోవడంతో ఈ సంవత్సరం RTE చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల అడ్మిషన్లు ప్రారంభం కాలేదనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) కింద జరిగిన విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ జీఆర్ స్వామినాథన్, వి. లక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. 2023–2024 విద్యా సంవత్సరానికి RTE రీయింబర్స్‌మెంట్‌ల కోసం తమిళనాడు రూ.188 కోట్లు భరించిందని, కేంద్రం ఇంకా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని పేర్కొంది. ఈ నిధులు సమగ్ర శిక్ష పథకంలో భాగమని కేంద్రం కోర్టుకు తెలిపింది. రూ.2,151 కోట్లలో రూ.200 కోట్లు RTE రీయింబర్స్‌మెంట్‌ల కోసం కేటాయించారు. అయితే, తమిళనాడు NEPని స్వీకరించనందున నిధులు నిలిపివేయబడ్డాయని కేంద్రం తెలిపింది.
బీజేపీ తమిళనాడుపై కక్షగట్టింది: డీఎంకే
ఈ విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్నందున వల్ల ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా, ఆర్టీఈ నిధులను ఎన్ఈపీ అమలుకు అనుసంధానించడానికి ఎలాంటి అవకాశం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. చట్ట ప్రకారం ప్రైవేట్ పాఠశాలలకు నిధులను విడుదల చేయాలని కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీఎంకే ప్రతినిధి ఎ . శరవణన్ స్పందించారు. బీజేపీ తమిళనాడును లక్ష్యంగా చేసుకుని విధాన నిర్ణయాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. మీరు మాపై హిందీని రుద్దలేరని బీజేపీ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు. వారు తమిళనాడు ప్రజలను శిక్షించాలనుకుంటున్నారు. తమిళులు అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదు అని తీవ్ర స్థాయి విమర్శలు చేశారు.






