- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Agro Terrorism: చైనా ఆగ్రో టెర్రరిజంను తేలిగ్గా తీసుకోవద్దు.. అనలిస్ట్ గోర్డాన్ చాంగ్ హెచ్చరిక
చైనా ఆగ్రో టెర్రరిజంపై ప్రముఖ అనలిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనా (China) ల్యాబ్ లో తయారు చేసిందనే ఆరోపణలు ఇంకా తొలగిపోకముందే డ్రాగన్ కంట్రీపై అగ్రో టెర్రరిజం (Agro Terrorism) ఆరోపణలు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా అమెరికాలోకి అత్యంత విషపూరిత ప్రమాదకరమైన ఫంగస్ తీసుకువచ్చారని ఇద్దరు చైనీయులను అమెరికా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ధాన్యం దిగుబడిని చావు దెబ్బ తీసేందుకే ఈ ప్రమాదక శిలీంధ్రాన్ని తరలించారనే ఆరోపణల వేళ అమెరికాలో (America) స్థిరపడిన చైనాకు చెందిన అనలిస్ట్ గోర్డాన్ చాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా కరోనానాను మించిన మహమ్మారి రావడం ఖాయం అని ఆయన హెచ్చరించారు. చైనా నుంచి అక్రమంగా తరించిన ఫుసేరియమ్ గ్రామినీరమ్ ఫంగస్ ను తేలిగ్గా తీసుకోవద్దని, చైనా అగ్రో టెర్రరిజమ్ ను అరికట్టాలంటే ఆ దేశంతో అమెరికా సంబంధాలు తెంచుకోవాలన్నారు. లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. చైనా చేపట్టిన ఈ చర్య అమెరికాపై యుద్ధం చేయడనమేనని, చైనా విషయంలో యూఎస్ కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.






