- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వీడియోలు షేర్ చేయకండి... కేంద్రం కీలక ఆదేశాలు
ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఘటన తరవాత కేంద్రం పాకిస్థాన్ నుండి ఎగుమతులు దిగుమతులను నిలిపివేసింది. పాకిస్థాన్ పౌరులు ఎవరు దేశంలో ఉన్నా వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాాలని ఆదేశాలు జారీ చేసింది. పాక్ సైతం భారతీయులు తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో యుద్దం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ సైతం తాము ఎల్లప్పుడు సిద్దమే అని స్పష్టం చేసింది.
ఒకవేళ యుద్ధం వచ్చినా ఎదుర్కుంటామని ఇండియన్ ఆర్మీ ధీమాగా ఉంది. ఇక కశ్మీర్ ఘటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆర్మీకి సంబంధించిన వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఢిఫెన్స్ ఆపరేషన్స్ సైతం లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సమాచార శాఖ అన్ని మీడియా ఛానళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణశాఖ కార్యలాపాలు, భద్రతా బలగాల కదలికలను లైవ్ టెలికాస్ట్ చేయవద్దని ఆదేశించింది. అలా చేయడం వల్ల డిఫెన్స్ ఆపరేషన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన వార్తలను షేర్ చేయవద్దని కోరింది. భద్రతకు సంబంధించిన కీలక అంశాలు లీక్ అయ్యే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.






