- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ నుంచి తప్పుకోకండి.. బీజేపీ నేతలకు Arvind Kejriwal విజ్ఞప్తి..
దిశ, వెబ్‌డెస్క్: అధికార పార్టీలో ఉంటూనే తమ పార్టీ కోసం పని చేయాలంటూ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేశారు...

దిశ, వెబ్‌డెస్క్: అధికార పార్టీలో ఉంటూనే తమ పార్టీ కోసం పని చేయాలంటూ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. శనివారం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ నేతలంతా బీజేపీ పార్టీలో ఉంటూ ఆప్‌కు పనిచేస్తూ అధికార పార్టీ నుంచి పేమెంట్ అందుకోమని ఆయన కోరారు. గుజరాత్‌కు రెండు రోజుల పర్యటనకు వెళ్లిన కేజ్రీవాల్ శనివారం రాజ్‌కోట్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను ఇచ్చే హామీల ద్వారా బీజేపీ నేతలు లబ్ధి పొందుతారని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
'మాకు బీజేపీ నేతలు అక్కర్లేదు. బీజేపీ తమ నేతలకు ఉంచుకోవచ్చు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం సేవ చేసిన పార్టీ నేతలు, కార్యదర్శులకు బీజేపీ పార్టీ ఏమిచ్చిందని నేను అడగాలనుకుంటున్నాను. గుజరాత్‌లో బీజేపీ నేతలు భారీ ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారు. మీరు మీ పార్టీలోనే ఉండండి. కానీ మా కోసం పనిచేయండి. బీజేపీ ఇచ్చే పేమెంట్ తీసుకొని మాకు పనిచేయండి. ఎందుకంటే మా దగ్గర అంత డబ్బు లేదు' అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.






