- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీక్కూడా ఈ మెసేజ్ వచ్చిందా.. జాగ్రత్త అకౌంట్ ఖాళీ అయిపోతుంది
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. అమాయకులే కాదు.. తెలివిగా వ్యవహరించేవారు కూడా సైబర్ నేరగాళ్ల మాయలో పడి లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. అమాయకులే కాదు.. తెలివిగా వ్యవహరించేవారు కూడా సైబర్ నేరగాళ్ల మాయలో పడి లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా రూ.46,715 సహాయం పొందవచ్చు.. అందుకోసం లింక్ పై క్లిక్ చేసి పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలంటూ వాట్సప్ లో ఒక మెసేజ్ వస్తోంది. మీక్కూడా అలాంటి మెసేజ్ ఏదైనా వస్తే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే అది ఫేక్. ఆశపడి ఆ లింక్ పై క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న సొమ్మంతా కేటుగాళ్లకు వెళ్లిపోతుంది.
వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న ఆ మెసేజ్ కేంద్రప్రభుత్వం పంపుతున్నది కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. ఇది ఒక స్కామ్ అని, ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి స్కీమ్ ప్రకటించలేదని తెలిపింది. దీనిపై PIB ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది. అలాంటి లింక్స్ ను నమ్మొద్దని, వాటిని ఎవరికీ షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేసింది.






