- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క ఫైల్ మిస్ కావొద్దు.. అధికారులకు పశ్చిమ బెంగాల్ సీఎస్ కీలక ఆదేశాలు
పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్ల టీఎంసీ అధికారానికి ఫుల్ స్టాప్ పడిన వేళ ప్రభుత్వ ఫైళ్ల భద్రతపై సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిబెంగాల్‍లో 15 ఏళ్ల టీఎంసీ అధికారానికి ఫుల్ స్టాప్ పడింది. మమతా బెనర్జీకి పాలనకు గుడ్ బై చెబుతూ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి బీజేపీకి ఓటర్లు పట్టం కట్టారు. ఈ విషయం పట్ల బీజేపీ ఫుల్ జోష్‍లో ఉండగా ఓటమి పట్ల టీఎంసీ తీవ్ర నిరాశ చెందుతోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు మరియు ముఖ్యమైన పత్రాల భద్రతపై అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ అయ్యాయి. కార్యాలయాల నుండి ఎటువంటి ముఖ్యమైన పత్రాలు లేదా ఫైళ్లను తొలగించడం, నష్టం కలిగించడం లేదా బయటకు తీసుకువెళ్లడం జరగకుండా చూడాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల కార్యదర్శులు, కార్యాలయ అధిపతులకు ఒక కీలక ఉత్తర్వు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ నారియాల పేరుతో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు అరాచక పాలన సాగిందంటూ ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.






