- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్ ఫలహా యూనివర్సిటీ చైర్మన్ కు రూ.415 కోట్ల విరాళాలు
ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఆత్మహుతి దాడి గురించి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఆత్మహుతి దాడి గురించి తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది మరణించగా.. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన వెనక హరియాణాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు ఉన్నట్టు నిఘా సంస్థలు తేల్చాయి. పలువురు యూనివర్సిటీ ఉద్యోగులను అరెస్ట్ చేయగా.. అనేకమంది పరారిలో ఉన్నారు. అయితే తాజాగా ఈ యూనివర్సిటీ గురించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
ఆల్ ఫలాహ్ గ్రూపు చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిక్‌కు విరాళాల రూపంలో 415 కోట్లు అందినట్లు ఈడీ గుర్తించింది. తన ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి అక్రమ రీతిలో ఆ నిధులను సమీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గల్ఫ్‌లో ఫ్యామిలీ సభ్యులు స్థిరపడడం వల్ల అక్కడికి పారిపోయే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. ఫరీదాబాద్‌లో రోజంతా జరిగిన తనిఖీల తర్వాత అల్ ఫలాహ్ యూనివర్సిటీ గ్రూపు చైర్మన్ సిద్ధిక్‌ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.






