RCB: ఆర్సీబీ టీమ్ పేరుతో డొనేషన్ క్యూఆర్ కోడ్.. వైరల్ గా మారిన ఫ్యాన్స్ రియాక్షన్

by Prasad Jukanti |   (  Updated:2025-05-03 10:00:50  IST  )

ఆర్సీబీ టీమ్ పేరుతో డొనేషన్ క్యూఆర్ కోడ్ వైరల్ గా మారింది.

RCB: ఆర్సీబీ టీమ్ పేరుతో డొనేషన్ క్యూఆర్ కోడ్.. వైరల్ గా మారిన ఫ్యాన్స్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అనగానే ప్రధానంగా ఆర్సీబీ (RCB) పేరు వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్క టైటిల్ కాడా సాధించలేకపోయినా ఆ టీమ్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ పేజ్ లలో సీఎస్కే పేరు మీద ఉన్న రికార్డును ఆర్సీబీ ప్యాన్స్ క్రాస్ చేసి టాప్ లోకి వచ్చిన సగంతి తెలిసిదే. ఈ సీజన్ లో టీమ్ ఫర్మార్మెస్ తో ఫిదా అవుతున్న ఫ్యాన్స్ ‘ఈ సాల కప్ పక్కా నమ్ దే’ అని పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ టీమ్ కు అంతా మంచే జరగాలని కోరుతూ ఓ నెటిజన్ చేసిన డొనేషన్ క్యూఆర్ కోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘డొనేట్ రూ.10 ఫర్ ఆర్సీబీ గుడ్ లక్' (Donation for RCB) అంటూ కంటెంట్ క్రియేటర్ సార్థక్ సచ్ దేవా ఓ క్యూఆర్ కోడ్ ను పబ్లిక్ ప్లేస్ లలో అతికించారు. ఈ క్యూఆర్ కోడ్ వ్యవహారం తొలుత నవ్వుకునేలా ఉన్నా ఆశ్చర్యపడే రీతిలో ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభించింది. చాలా మంది ఈ క్యూఆర్ కోడ్ కు రియాక్ట్ కావడం మొదలు పెట్టారు. రోజులో చివరి నాటికి సార్థక్ కు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 1200 డొనేషన్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సార్థక్ సచ్ క్రికెట్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ ఇది అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. మరోవైపు 2025 లో ఆర్సీపీ జోరు కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ 7 మ్యాచ్ లో విజయం సాధించింది 3 మ్యాచ్ లో ఓటమితో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సీజన్ లో భాగంగా ఇవాళ ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మధ్య ఆసక్తికర పోరు నడవనుంది.


Next Story