సరిహద్దుల్లో నేరస్తులు రెచ్చిపోతున్నారు.. తొలి ప్రసంగంలోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
సరిహద్దుల్లో నేరస్తులు రెచ్చిపోతున్నారు.. తొలి ప్రసంగంలోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యమైన అమెరికా(America)కు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 47వ అధక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. 78వ ఏళ్ల వయసులో రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని అన్నారు. అమెరికా అనేదే తన తొలి నినాదంగా చెప్పారు.

‘ఎన్నో ఏళ్లుగా అనేక ఆటుపోట్లను తట్టుకొని అమెరికా నిలబడింది. సమస్యలకు ఏనాడూ కుంగిపోలేదు. ధైర్యంగా నిలబడ్డాం. అమెరికా ఇంతకంటే గొప్పగా, పటిష్టంగా రూపొందుతుంది. అమెరికాకు దేశ సరిహద్దుల రక్షణ ఎంతో ముఖ్యం. సరిహద్దుల్లో నేరస్తులు పెట్రేగిపోతున్నారు. సరిహద్దుల్ని రక్షించడంతో పాటు అభివృద్ధిపై దృష్టి పెడతాం. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాల్సి ఉంది. ప్రజావైద్యం కూడా మరింత మెరుగుపరుస్తాం. శాంతిభద్రతల విషయంలో కూడా కఠినంగా ఉంటాం. న్యాయవ్యవస్థను పటిష్టం చేస్తాం. అమెరికాను నెంబర్-1 నిలబెట్టడమే మా లక్ష్యం’ అని అన్నారు.

అంతేకాదు.. దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వరుస తుఫాన్లు అమెరికాను అతలాకుతలం చేశాయని అన్నారు. దేవుడి దయతో కాల్పుల నుంచి బయటపడ్డానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కారణం కోసమే దేవుడు తన ప్రాణాలు కాపాడాడని చెప్పారు. ఈ సందర్భంగా డ్రిల్ బేబీ డ్రిల్ నినాదాన్ని ట్రంప్ రిపీట్ చేశారు. కాగా, భారత కాలమానం ప్రకారం సరిగ్గా సోమవారం రాత్రి 10.30 గంటలకు ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు.

Advertisement

Next Story

Most Viewed